Amitabh Bachchan: వారితో కలిసి కల్కి చూడాలని ఉంది.. అమితాబ్ కామెంట్స్ వైరల్!

July 10, 2024

Amitabh Bachchan: వారితో కలిసి కల్కి చూడాలని ఉంది.. అమితాబ్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్ దీపిక పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాలను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్ దీపిక పదుకొనేతో పాటు అమితాబ్ కమల్ హాసన్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈయనతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఇందులో భాగంగా అమితాబ్ మాట్లాడుతూ కల్కి సినిమా చేసినందుకు నటుడిగా నాకు ప్రశంసలు దక్కలేదు కానీ ఈ సినిమాలో నేను చేసిన ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు ప్రశంసలు వస్తున్నాయి. ‘కల్కి’లో దీపికా పదుకొణె పాత్ర అద్భుతం. ఈ ఐడియా వచ్చినందుకు మిమ్మల్ని ప్రసంశించాలని తెలిపారు. ముఖ్యంగా దీపికా పదుకొనే మంటలలో నుంచి వస్తున్న సన్నివేశం చాలా హైలెట్ అయింది అప్పుడు ఆమె నడుస్తూ వస్తున్న తనకి ఏమీ కాలేదు దీనిపై ప్రేక్షకులను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టాలని అడిగారు.

ఇక తనకు కల్కి సినిమాని తెలుగు ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడాలని ఉందని ఈయన తన మనసులో మాటను బయటపెట్టారు. ఎందుకంటే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని అమితాబ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు