కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ లో భారీ ట్విస్ట్…. కల్కి చూడాలంటే అన్ని నెలలు వెయిట్ చేయాలా?

July 3, 2024

కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ లో భారీ ట్విస్ట్…. కల్కి చూడాలంటే అన్ని నెలలు వెయిట్ చేయాలా?

Kalki Movie OTT Release: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది థియేటర్లలో ఇప్పటివరకు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా 1000 కోట్లను చాలా సులభంగా క్రాస్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయమందుకోవడంతో ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా హిందీ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా ఇతర భాష హక్కులను అమెజాన్ వారు కొనుగోలు చేశారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం అందుకోవడంతో సుమారు రెండు నెలల వరకు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కాదని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయిన నేపథ్యంలో జూలై చివరి వారం లేదంటే ఆగస్టు మొదటి వారం ఓటీటీలో ప్రసారమవుతుందని అభిమానులు భావించారు కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని సెప్టెంబర్ చివరి వారంలో ఓటీటీలో ప్రసారం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది త్వరలోనే అధికారకంగా తెలియజేయబోతున్నారు.

ఇలా జూలై చివరివారం లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని అభిమానులు భావించారు కానీ ఈ సినిమా ఏకంగా సెప్టెంబర్ వరకు స్ట్రీమింగ్ కాదు అనే విషయం తెలిసిన అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడమే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వాయిదాకి కారణమని తెలుస్తుంది

Related News

ట్రెండింగ్ వార్తలు