ముందుగానే వచ్చేస్తున్న బిగ్ బాస్ 8… లాంచింగ్ ఎప్పుడంటే?

July 1, 2024

ముందుగానే వచ్చేస్తున్న బిగ్ బాస్ 8… లాంచింగ్ ఎప్పుడంటే?

Bigg Boss 8 Telugu Launch Date: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. అయితే బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో లలో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ కార్యక్రమం ఇతర భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటికే 7 సీజన్లో పూర్తి అయ్యాయి త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.

నిజానికి బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ రెండవ వారంలో ప్రసారమవుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం అనుకున్న సమయానికంటే ముందుగానే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మేకర్స్ బిగ్ బాస్ హౌస్ ఏర్పాటు చేయడమే కాకుండా మరోవైపు కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోయ కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా స్టార్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా రీతు చౌదరి, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, బర్రెలక్క, కుమారి ఆంటీ వంటి వారితో పాటు మరికొందరు సెలబ్రిటీలు అలాగే గత సీజన్లో పాల్గొన్న కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ సీజన్లో పాల్గొన్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్ లో కాకుండా ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఆగస్టు 4 లేదా 11 వ తేదీలలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు