జనసేన వల్ల టీడీపీకి ఓటమి… యూటర్న్ తీసుకున్న బిగ్ బాస్ శివాజీ?

March 6, 2024

జనసేన వల్ల టీడీపీకి ఓటమి… యూటర్న్ తీసుకున్న బిగ్ బాస్ శివాజీ?

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శివాజీ రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈయన గత ఎన్నికల ముందు టిడిపి పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. పక్క టిడిపి పార్టీ వస్తుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. వైసిపి పార్టీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయన టిడిపి గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ పోటీ చేయడం వల్ల టిడిపి పార్టీ 16 స్థానాలలో ఓటమిపాలైందని తెలిపారు.

ఇక గత ఎన్నికలలో ఆపరేషన్ గరుడ అనే ఒక సర్వే ద్వారా ఈయన సర్వే చేయించారని ఎన్నికలలో వైసిపి పార్టీ అధికారంలోకి రాదని, ఇక ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే ఎన్నికలలో 151 సీట్లతో వైసిపి అధికారంలోకి వచ్చింది. ఇలా గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని ఎంతో అభిమానించిన ఈయన ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ తర్వాత ఈయన తిరిగి రాజకీయాలలో ఎంతో బిజీ అవుతారని అందరూ భావించారు. ఇలా రాజకీయాలలోకి ఈయన వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ పొందుతారని టికెట్ పొందినాక ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అంటూ అందరూ భావించారు కానీ ఈయన మాత్రం తాజాగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా జనసేన టిడిపి గురించి ఈయన మాట్లాడుతూ ఈ రెండు పార్టీలో పొత్తు గురించి నాకు ఏ విధమైనటువంటి క్లారిటీ లేదని తెలిపారు. ఫిక్స్ అయితే అవ్వచ్చు కానీ రాజకీయ పార్టీలు కేవలం వారి అవసరాలు అవకాశాలను మాత్రమే చూసుకుంటారని తెలిపారు. ఇక నన్ను రాజకీయాలలోకి రమ్మని ఎవరు పిలచలేదు. ఇక నాకు వెళ్లాలని ఆసక్తి కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కేస్తావు నేను అధికారంలో ఉంటే నిన్ను చంపేస్తా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఇలాంటిదే అని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ టిడిపికి ప్లస్ ,వైసీపీకి మైనస్. ఇలాంటి రివెంజ్ రాజకీయాలు ప్రజలకు అసలు మంచిది కాదు అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Read More: పొట్టకూటి కోసం ఈ పనులు చేయక తప్పలేదు.. విష్ణు ప్రియ పోస్ట్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు