శివాజీ కూతురిని గెలికిన సుడిగాలి సుధీర్.. కామన్ సెన్స్ లేదా అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ!

June 4, 2024

శివాజీ కూతురిని గెలికిన సుడిగాలి సుధీర్.. కామన్ సెన్స్ లేదా అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ!

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సుధీర్. కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా డాన్సర్ గా,యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సుధీర్. గత ఏడాది సుడిగాలి సుధీర్ ఒక హిట్ కూడా కొట్టాడు. ఆయన నటించిన గాలోడు చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా గాలోడు తర్వాత విడుదలైన కాలింగ్ సహస్ర మాత్రం ప్రభావం చూపలేదు.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ గోట్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. సిల్వర్ స్క్రీన్ ని నమ్ముకుని గుడ్డిగా వెళితే కరెక్ట్ కాదని సుడిగాలి సుధీర్ మరలా యాంకరింగ్ వైపు దృష్టి పెట్టాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సర్కార్ సీజన్ 4కి హోస్ట్ గా చేస్తున్నాడు. అలాగే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరొక షో స్టార్ట్ చేశాడు. ఈ రెండు షోలలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ ఆకర్షణీయంగా ఉంది. తన మార్క్ కామెడీ, సెటైర్స్ తో ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. సర్కార్ గేమ్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

శివాజీ సైతం హాజరయ్యాడు. ఈ షోలో సుడిగాలి సుధీర్ కి శివాజీ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది . శివాజీ కూతురుని సుడిగాలి సుధీర్ గెలికే ప్రయత్నం చేశాడు. దాంతో శివాజీ సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇచ్చాడు. శివాజీ తర్వాత నాయని పావని షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఎంట్రీ సాంగ్ గా సూపర్ మూవీలోని దొరికినంత దోచుకో సాంగ్ వేశారు. ఆ సాంగ్ కి సుధీర్, నయని పావని కలిసి డాన్స్ చేశారు. వెల్కమ్ అంటూ నయని పావనిని సుధీర్ హగ్ చేసుకోబోయాడు. నయనిని తప్పించి శివాజీ వచ్చి సుధీర్ ని హగ్ చేసుకుంటాడు. దాంతో సుధీర్ అవాక్కు అవుతాడు. పట్టేసుకుందామనే అని శివాజీ సుధీర్ పై మరో పంచ్ వేశాడు. అసలు దొరికినంత దొరికినంత దోచుకో సాంగ్ అర్థం ఏమిటో తెలుసా? అని నయని పావనికి సుధీర్ చెప్పే ప్రయత్నం చేశాడు. మధ్యలో కల్పించుకున్న శివాజీ పగిలిపోద్ది అని సుధీర్ కి వార్నింగ్ ఇచ్చాడు. కాగా నయని పావనికి తండ్రి లేడు. బిగ్ బాస్ హౌస్ లో పరిచయమైన శివాజీని ఆమె తండ్రి కాని తండ్రిగా భావిస్తుంది. వీరిద్దరూ ఫాదర్-డాటర్ రిలేషన్ ఫీల్ అవుతూ ఉంటారు.

Read More: చరణ్, తారక్ సినిమాలకు ఊహించని కండిషన్ పెట్టిన జాన్వీ… అవి ఉండకూడదంటూ?

ట్రెండింగ్ వార్తలు