April 5, 2024
జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించి మెప్పించినటువంటి వారిలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే జోర్దార్ సుజాత జోర్దార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు.
ఇలా జోర్దార్ వార్తలు ద్వారా ఫేమస్ అయినటువంటి సుజాత బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుజాత జబర్దస్త్ కార్యక్రమంలో కూడా కొనసాగారు. ఇక రాకింగ్ రాకేష్ తో కలిసి స్కిట్లు చేస్తున్నటువంటి ఈమె ఆయన ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం చేసుకున్న ఈ జంట కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇక సుజాత ఇటీవల కాలంలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలోను వృత్తి పరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ జంటకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుజాత తల్లి కాబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు కానీ తాజాగా ఈమె సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాను తల్లి కాబోతున్న మాట వాస్తవమైనవి అయితే ఈ విషయాన్ని సుజాత రహస్యంగా ఉంచారని తెలుస్తుంది.
ఈమె సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను మరో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను భార్య షేర్ చేశారు.హ్యాపీ ఫర్ యూ.. కంగ్రాట్యులేషన్స్ అంటూ ఈ ఫోటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. అయితే ఈమె ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచడానికి కూడా కారణం ఉందని తెలుస్తుంది. ఇటీవల ముక్కు అవినాష్ భార్య తల్లి కాబోతుంది అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఆమె బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బహుశా దిష్టి తగిలి తన బిడ్డ పుట్టకుండానే తాము కోల్పోయామని భావించారు దీంతో ఈమె కూడా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని దాచి పెట్టారని తెలుస్తుంది.