March 27, 2023
అచ్చ తెలుగు బ్యూటీ బిందు మాధవి హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి చాలాకాలమే అయింది. తెలుగు కంటే తమిళ్ లో ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకున్న బిందు రీసెంట్ గా బిగ్ బాస్ షో ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దగ్గర కావడమే కాదు.. మళ్లీ సినిమాల్లోనూ బిజీ అవుతోంది. రీసెంట్ గా తను నటించిన యాంగర్ టేల్స్ అనే సిరీస్ కు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ సిరీస్ లోని తను నటించిన కథ, తన నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. బిందులో ఎంత గొప్ప నటి ఉంది అన్న విషయం ఈ యాంగర్ టేల్స్ మరోసారి నిరూపించింది. దీంతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ ఇప్పటికే సత్తా చాటిన బిందు సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ సిరీస్ ఊతం ఇచ్చిందనే చెప్పాలి.
ప్రస్తుతం తను ఏకంగా నాలుగు వెబ్ సిరీస్ లతో పాటు ఒక సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా వరుసగా వస్తోన్న అవకాశాలను మరింత పెంచుకునేందుకు లేటెస్ట్ గా తను ఓ ఫోటో షూట్ కూడా చేసింది. ఈ ఫోటో షూట్ లో తన స్టైలిష్ లుక్స్ తో ఆల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తోంది. కేవలం తెలుగు మాత్రమే కాదు.. మళ్లీ తమిళ్ పరిశ్రమపై దృష్టి పెట్టేలా తన ఫోకస్ పెంచింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో బిందు తెలుగులో మరింత స్టార్డమ్ తెచ్చుకుంటుందని విశ్లేషకుల అంచనా.
మొత్తంగా తెలుగు బ్యూటీ టాలెంట్ కు తగ్గ ఆఫర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ట్ అయ్యాయి. అందుకే మరింత దూకుడుగా అన్ని ఆఫర్స్ ను అందిపుచ్చుకునే ప్రయత్నాల్ల ఉంది బిందు.