టాక్సిక్ లో నటించబోతున్న బాలీవుడ్ భామ.. 8 ఏళ్లలో చేసింది రెండు సినిమాలే!

May 14, 2024

టాక్సిక్ లో నటించబోతున్న బాలీవుడ్ భామ.. 8 ఏళ్లలో చేసింది రెండు సినిమాలే!

యష్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని ప్రకటించి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందకపోయినా తరచూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని కూడా కేజీఫ్ లాగా రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారంట మూవీ యూనిట్. కే జి ఎఫ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అన్నది ఒక శీర్షిక. మలయాళీ నటి, దర్శకురాలు గీతు మోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్ట్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. యాక్షన్ ప్రియులను అలరించే కథాంశం తో ఇది సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా కథ గ్లోబల్ అప్పీల్ తో కూడుకున్నదని, ప్రపంచ సినిమా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం యష్ తన నాలుగు సంవత్సరాల కాలాన్ని అంకితం చేశాడు.

గత రెండేళ్లుగా సినిమా కధ ఎంపిక, లొకేషన్స్, టెక్నీషియన్ సెర్చ్ తదితర పనుల్లో నిమగ్నమయ్యాడు ఇప్పుడు ఎట్టకేలకు షూటింగ్ మొదలైంది. 2016 లో వచ్చిన సంతు స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా తరువాత యష్ 8 ఏళ్లలో కేవలం రెండు సినిమాలలో మాత్రమే నటించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాలో నయనతార ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అందింది.

కాగా ఇప్పుడు ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ కథలో ఆమె పూర్తిగా యాక్షన్ సీక్వెల్ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది అందుకే యుఎస్ లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వి ఎఫ్ ఎక్స్ స్టూడియోలతో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Read More: కన్నప్ప టీజర్ ని ఏకంగా అక్కడ రిలీజ్ చేస్తున్న మంచు విష్ణు.. ఆనందంగా ఉందంటూ ట్వీట్!

Related News

ట్రెండింగ్ వార్తలు