పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెంట్ అయిన నటి… ఇదేం ట్విస్ట్ అంటున్న ఫ్యాన్స్?

July 7, 2024

పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెంట్ అయిన నటి… ఇదేం ట్విస్ట్ అంటున్న ఫ్యాన్స్?

Sonakshi Sinha: ఇటీవల కాలంలో హీరోయిన్లు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది ముందు పిల్లల్ని కన్న తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు అయితే తాజాగా మరో నటి సైతం ముందుగానే ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి సోనాక్షి సిన్హా. హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె తన స్నేహితుడు జహీర్ అనే వ్యక్తిని ఇటీవల వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఏడు సంవత్సరాల నుంచి మంచి పరిచయం ఉంది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇటీవల ఈమె ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఇలా వీరి పెళ్లి జరిగి పది రోజులు కూడా కాకుండానే హీరోయిన్ సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేంటి పెళ్లి జరిగిన పది రోజులకే ప్రెగ్నెంటా అనే షాక్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సోనాక్షి తన ప్రేగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.

తాను హాస్పిటల్ కి వెళ్ళగానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు హాస్పిటల్ కి వెళ్తేనే ప్రెగ్నెంటా అంటూ ఈమె షాకింగ్ సమాధానం చెప్పారు. అంతే కాకుండా హాస్పిటల్ కి వెళ్లడానికి గల కారణాన్ని కూడా తెలిపారు. తన తండ్రి శత్రుజ్ఞ సిన్హా అనారోగ్యానికి గురై ముంబైలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈ విషయం తెలిసిన ఈమె తన తండ్రిని చూడటం కోసం తన భర్తతో పాటు కలిసి వెళ్లినట్టు క్లారిటీ ఇచ్చారు.. ఇలా ఈమె క్లారిటీ ఇవ్వడంతో ప్రెగ్నెన్సీ వార్తలకు పూర్తిగా చెక్ పడింది.

Related News

ట్రెండింగ్ వార్తలు