బ్రతికుండగా అలా జరగనివ్వను.. శ్రీదేవి బయోపిక్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!

April 4, 2024

బ్రతికుండగా అలా జరగనివ్వను.. శ్రీదేవి బయోపిక్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!

అతిలోక సుందరి శ్రీదేవి 2018 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పటికీ ఆమెని దేవతలా ఆరాధించే ఆమె అభిమానులు మాత్రం ఆమెని మరిచిపోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె జర్నీ నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ఆమె చనిపోయి ఎన్ని సంవత్సరాలయినప్పటికీ ఆమె గురించి ఇప్పటికీ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం ఆమె బయోపిక్ గురించిన చర్చ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీదేవి జీవిత కథ ని తెరపైకి తీసుకురావడానికి చాలామంది డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఆమె భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్ వద్దకు తమ ప్రపోజల్ ని కూడా చాలామంది తీసుకుని వెళ్లారంట. అయితే బోనికపూర్ మాత్రం తన భార్య శ్రీదేవి బయోపిక్ తీయటానికి అనుమతి ఇవ్వను అంటూ ఖరాఖండిగా చెప్పటం విశేషం.

శ్రీదేవి చాలా పర్సనల్ పర్సన్, ఆమె లైఫ్ కూడా చాలా పర్సనల్ గా ఉండాలి. అందుకే నేను బ్రతికుండగా ఆమె బయోపిక్ తీయటానికి అనుమతి ఇవ్వను అంటూ తేల్చి చెప్పేశారు. సినిమాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి తన 50 ఏళ్ల కాలంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 300కు పైగా సినిమాల్లో నటించింది శ్రీదేవికి పద్మశ్రీ, నేషనల్ ఫిలిం అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో లభించాయి.

నటిగా ఆమె ఎంతో సక్సెస్ ని సాధించినప్పటికీ ఆమె పర్సనల్ లైఫ్ అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. ఎన్నో అవంతరాల మధ్య బోనీకపూర్ ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి కి ఇద్దరు కూతుర్లు. ఒకరు జాన్వీ కపూర్, ఒకరు ఖుషి కపూర్. అయితే జాన్వీ ని టాలీవుడ్ లో హీరోయిన్ గా చూడాలని కలలు కన్న శ్రీదేవి ఆ కల తీరకుండానే అనుమానాస్పద స్థితిలో 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించడం దురదృష్టకరం. అయితే ఆమె మరణం లో ఆమె భర్త పాత్ర ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. శ్రీదేవి మరణం తర్వాత ఆమె కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో నటించడం గమనార్హం.

Read More: మరొక టాలీవుడ్ సినిమాలో బిగ్ బి.. బుచ్చిబాబు డైరెక్షన్ లో చరణ్ కి తాతగా అమితాబ్!

ట్రెండింగ్ వార్తలు