May 14, 2024
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ గురించి మనందరికీ తెలిసిందే. అజయ్ దేవగణ్ ఇటీవల మైదాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. 1950 – 1962 మధ్య ఇండియన్ ఫుట్ బాల్ టీం కథ, అప్పుడు ఉన్న ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా మైదాన్ సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రియమణి ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించగా బోనీ కపూర్ జి స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మించారు. అయితే అత్యంత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైన విషయం తెలిసిందే.
విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేకపోయింది. ఈ సినిమా కోసం ఒకటి రెండు కాదు దాదాపుగా నాలుగు ఏళ్లకు పైగా కష్టపడి మరి భారీ ఖర్చు పెట్టి సినిమా తీశారు. కానీ ఈ సినిమా కనీసం 50 కోట్లు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ మంచి సినిమా అని అందరూ పొగిడారు. తాజాగా ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ మైదాన్ ఫ్లాప్ పై కామెంట్స్ చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఈ సినిమా ప్లాప్ పై స్పందిస్తూ.. మైదాన్ సినిమా అద్భుతమైన సబ్జెక్ట్. అజయ్ దేవగణ్ కూడా అద్భుతంగా నటించారు.
కానీ ప్రేక్షకుల డిమాండ్స్ మేము ఆలోచించలేదు. ఇప్పటి ఆడియన్స్ మైదాన్ లాంటి సినిమాల కన్న RRR, జవాన్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More: పవన్ చరణ్ నటించిన ఆ సినిమాలంటే చాలా ఇష్టం.. చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!