చనిపోయేముందు ఎమ్మెస్ నారాయణ ఆ కోరిక కోరారా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బ్రహ్మానందం?

June 7, 2024

చనిపోయేముందు ఎమ్మెస్ నారాయణ ఆ కోరిక కోరారా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన బ్రహ్మానందం?

మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎంఎస్ నారాయణ బ్రహ్మానందం కృష్ణ భగవాన్ అలీ వంటి వారు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి వారి పంచ్ డైలాగుల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇక అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ ప్రస్తుతం కొందరు మరణించినప్పటికీ మరికొందరు సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

ఇలా కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయన కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక ఈయన బ్రహ్మానందం కలిసి నటించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలి అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకెంతో ఇష్టమైన కమెడియన్లలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఆయన సరదాగా మాట్లాడుతూనే అందరిపై పంచ్ లు వేస్తారని తెలిపారు. ఇక ఆయనతో నాకు ఎంతో మంచి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. అయితే ఎమ్మెస్ నారాయణ చనిపోవడానికి ఒక గంట ముందు ఒక కోరిక కోరారని ఆ కోరిక గురించి ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలిపారు.

ఎమ్మెస్ నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా తన కుమార్తెను ఒక పేపర్ ఇవ్వమని చెప్పారట. అప్పటికే ఆయన మాట కూడా స్పష్టంగా రాలేదు అయితే ఆ పేపర్లో బ్రహ్మానందం గారిని చూడాలని ఉంది అంటూ రాశారట. అది చూసిన తన కుమార్తె వెంటనే నాకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. ఆ సమయంలో నేను ఆరడుగుల బుల్లెట్టు సినిమా షూటింగ్లో ఉన్నాను.

వెంటనే డైరెక్టర్ కి ఈ విషయం చెప్పి అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్ కి వచ్చాను. హాస్పిటల్ కి వచ్చి ఏం ఎస్ నారాయణని చూడగానే చాలా బాధ కలిగింది. నా చేయిని పట్టుకొని ఏదో చెప్పాలని చూస్తున్నారు. అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తున్నారు. ఆ పరిస్థితులలో తనని చూడలేక నేను బయటికి వచ్చాను అలా బయటకు వచ్చిన 15 నిమిషాలకే తాను మరణించాడు అంటూ ఎమ్మెస్ నారాయణ గురించి బ్రహ్మానందం చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇబ్బంది పెడుతున్నాయి: యాంకర్ శ్యామల

ట్రెండింగ్ వార్తలు