December 16, 2021
బాలీవుడ్‌లో కాబోయే భార్య భర్తలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్, డింపుల్‌కపాడియా, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. కరణ్‌జోహార్ నిర్మాత. అయితే ట్రయాలజీగా రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తొలిపార్టు విడుదలపై ఎప్పట్నుంచో సస్పెన్స్ నడుస్తోంది. ఈ సస్పెన్స్ తొలగిపోయింది. ‘బ్రహ్మాస్త్ర’ తొలి పార్టును వచ్చే ఏడాది నవంబరు 9 విడుదల చేయనున్నారు. ఇందులో శివ పాత్రలో కనిపిస్తారు రణ్‌బీర్‌కపూర్. ఇక పురావస్తు శాస్త్రవేత్తగా నాగార్జున కనిపిస్తారు.