థర్డ్‌ వేవ్‌ …లైగర్‌ షూటింగ్‌ క్యాన్సిల్‌

January 7, 2022

థర్డ్‌ వేవ్‌ …లైగర్‌ షూటింగ్‌ క్యాన్సిల్‌

నిన్నమొన్నటివరకు కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ ‘వలిమై’ వంటి భారీ చిత్రాల రిలీజ్‌లు మాత్రమే వాయిదా పడ్డాయి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్స్‌ కూడా క్యాన్సిల్‌ అవుతుండటం ఇండస్ట్రీ వ‌ర్గాల్ని కలవరపెడుతోంది. ఆల్రెడీ ఢిల్లీలో జరగాల్సిన సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ సినిమా వాయిదా పడింది. తాజాగా విజయ్‌దేవరకొండ హీరోగా చేస్తున్న ‘లైగర్‌’ సినిమా షూటింగ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. ‘లైగర్‌’ షూటింగ్‌ క్యాన్సిలైనట్లు విజయ్‌ దేవరకొండ తెలిపారు. ‘కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తరు ణంలో ‘లైగర్‌’ షూటింగ్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో ఇంట్లోనే చిల్‌ అవుతున్నాను అని విజయ్‌ ట్వీట్‌ చేశారు. ఇక ‘లైగర్‌’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Read more వైఎస్‌జగన్‌గారు వారితో జాగ్రత్తగా ఉండండి…ఆర్జీవీ సలహా https://twitter.com/TheDeverakonda/status/1479345979937595394

ట్రెండింగ్ వార్తలు