ప్రభాస్ కల్కి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు.. ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

June 8, 2024

ప్రభాస్ కల్కి ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు.. ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఈ నెల అనగా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్ లు ఈ సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఇకపోతే ఇప్పటికే ఓవర్సీస్‌లో టిక్కెట్ల అమ్మకం మొదలై రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.

మరోవైపు మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన మెగా ఈవెంట్ ని అశ్వనీదత్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు జైలుకు వెళ్ళి పరామర్శించి, తెలుగుదేశం వచ్చే ఎలక్షన్స్ లో 160 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో అభినందనలు తెలిపిన అశ్వినిదత్‌.. తాజాగా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారు చేయబోయే కల్కి ఈవెంట్ కు చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా రావాలని కోరినట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ ఈ ఈవెంట్ జరగనుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు?

ట్రెండింగ్ వార్తలు