నటి పవిత్రా జయరామ్ ని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన భర్త.. ఒక్కసారి తిరిగి రావా అంటూ?

May 14, 2024

నటి పవిత్రా జయరామ్ ని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన భర్త.. ఒక్కసారి తిరిగి రావా అంటూ?

తాజాగా ప్రముఖ బుల్లితెర నటి పవిత్ర జయరాం ఆదివారం అనగా మే 12 న తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో ఒక్కసారిగా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మరణ వార్తను నటీనటులు అభిమానులు జీవించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా మే 13న ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని మండ్యలో జరిగాయి. ఇక ఆమె అంత్యక్రియలకు పలువురు సినీ బుల్లితెర ప్రముఖులు సైతం హాజరయి ఆమెకు అంతిమ వీడ్కోలు పలికారు. పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కాగా పవిత్ర జయరామ్ స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే యాక్సిడెంట్ లో పవిత్ర భర్త చంద్రకాంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. పవిత్ర భర్త చంద్రక్రాంత్ కూడా ప్రముఖ నటుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య మరణంపై చంద్ర కాంత్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నెట్టింట తెగ వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ అభిమానులు, నెటిజన్ల మనసులను కలచి వేస్తోంది. ఇందులో పవిత్రతో తాను దిగిన చివరి ఫొటోను షేర్ చేసిన చంద్ర కాంత్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

పాపా నీతో దిగిన ఆఖరి పిక్ రా.. నువ్వు నన్ను ఒంటరివాడివి చేశాన్న నిజాన్నిఅసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా పవిత్ర ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు చంద్రకాంత్ కు ధైర్యం చెబుతూ బాధపడకండి వెళ్లిన వారు ఇక తిరిగి రారు మీరు ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందగా కనిపించారు. అయితే ఇదే వారిద్దరి ఆఖరి సెల్ఫీ అవుతుందని మాత్రం అసలు ఊహించలేకపోయారు. ప్రస్తుతం పోస్ట్ అందరి మనసులను కలచివేస్తోంది. అభిమానులు, నెటిజన్లు పవిత్ర జయరాం కు నివాళి అర్పిస్తున్నారు. అలాగే చంద్రకాంత్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Read More: కన్న తల్లి ముందే ప్రముఖ నటుడిపై దాడి చేసిన దుండగులు.. నెట్టింట వీడియో వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు