Chiranjeevi: మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్‌

February 22, 2022

Chiranjeevi: మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్‌

రీసెంట్‌గా పుష్ప బ్లాక్‌బ‌స్ట‌ర్ తో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్ పేరు కూడా అన్ని భాషల్లో మారు మ్రోగిపోయింది. ఆ సినిమా అన్ని భాష‌ల్లో క‌లిపి 400 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. దాంతో అంద‌రి హీరోల దృష్టి సుకుమార్ మీద ప‌డింది. ప్ర‌స్తుతం పుష్ప 2 స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్న సుకుమార్ అతి త్వ‌ర‌లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని సుకుమార్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

https://www.instagram.com/p/CaSIb_KpP06/?utm_medium=share_sheet

`క‌ల నిజ‌మైంది. మెగాస్టార్ కోసం మెగాఫోన్ ప‌ట్టుకోబోతున్నాను. వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాను అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు సుకుమార్. అయితే ఇది ఓ ప్ర‌ముఖ బ్రాండ్ యాడ్ షూట్ అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ Chiranjeevi నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్‌29న విడుద‌ల‌కానుంది. ఆ త‌ర్వాత మొహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళాశంక‌ర్‌, మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫ‌ర్‌, బాబీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు.

Read More: Radheshyam: ప్ర‌భాస్ సినిమాకి అమితాబ్ వాయిస్ ఓవ‌ర్‌

   

ట్రెండింగ్ వార్తలు