నారా రోహిత్ ప్రధాన పాత్రలో ప్రతినిధి 2.. టీజర్ లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!

March 30, 2024

నారా రోహిత్ ప్రధాన పాత్రలో ప్రతినిధి 2.. టీజర్ లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!

ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ప్రతినిధి 2. ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి లాప్టాప్ ద్వారా ఆవిష్కరించారు. అందుకోసం మూవీ యూనిట్ మెగాస్టార్ నివాసానికి వెళ్ళింది. వారిని సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి మూవీ టీజర్ ని ఆవిష్కరించిన తర్వాత వారికి బెస్ట్ విషెస్ కూడా అందించారు.

2014లో రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అది మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతినిధి 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ టీజర్ ని చూస్తే రాష్ట్ర అభివృద్ధి, అలాగే రాష్ట్ర అప్పు ఇలాంటి అంశాలపై ఎక్కువగా సన్నివేశాలు ఉన్నట్లు కనబడుతుంది.

ఇక చివర్లో వచ్చి ఓటు వేయండి లేదంటే దేశం వదిలిపోండి లేదంటే చచ్చిపోండి అంటూ నారా రోహిత్ సీరియస్ గా డైలాగ్ చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటామనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పొలిటికల్ త్రిల్లర్ రావడం చర్చనీయాంసంగా మారుతుంది. ప్రస్తుత సమకాలీన రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యాత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ప్రతినిధి 2 టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పొలిటికల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు నారా రోహిత్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Read More: తమిళ నటుడు డేనియల్ బాలాజీ ఆకస్మిక మృతి.. షాక్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ!

Related News

ట్రెండింగ్ వార్తలు