ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంపై చిరు ఆసక్తికర ట్వీట్!

June 12, 2024

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంపై చిరు ఆసక్తికర ట్వీట్!

మెగాస్టార్ చిరంజీవి నేడు కేసరపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు విడుదల కాగా కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే.

ఇక ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి వేదికపై ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన అన్నయ్య కాళ్ళపై పడి నమస్కారం చేశారు. అనంతరం మోడీ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ప్రమాణస్వీకారం పూర్తి అయిన తర్వాత చిరంజీవి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇతర మంత్రివర్గానికి హార్దిక శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే అవకాశానికి సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.. ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Read More: నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా.. ఇండియన్ 2 పై రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు