పరువు వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన చిరు.. గర్వంగా ఉందంటూ?

June 20, 2024

పరువు వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన చిరు.. గర్వంగా ఉందంటూ?

మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే .ఈమె ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టి తన తండ్రి తమ్ముడు నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుస్మిత అనంతరం నిర్మాతగా మారారు. ఇప్పటికే ఈమె పలు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లను కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సుస్మిత తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టితో కలిసి సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సిరీస్‌కు సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది .

ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ వెబ్ సిరీస్ చూసిన చిరంజీవి ఈ పరువు సిరీస్ గురించి మాట్లాడుతూ..అద్భుతమైన కంటెంట్‌తో సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ ఓటీటీ సిరీస్ బాగుందని చిరంజీవి ట్వీట్ చేశాడు. సుస్మితను చూస్తుంటే గర్వంగా ఉందని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

నాగబాబు నటన బ్రిలియంట్ అంటూ సోదరుడిని మెచ్చుకున్నారు. ఇక ఈ సిరీస్ లో నాగబాబు మొదటిసారి నెగిటివ్ పాత్రలో నటించారు.ఇక నటన కూడా ఈ సిరీస్ కి కీలకంగా మారిందని తెలిపారు. ఇలా ఈ సిరీస్ ద్వారా సుస్మిత ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమె ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన అనుకున్న స్థాయిలో ఆ సినిమాలో సక్సెస్ కాలేకపోయాయని చెప్పాలి.

Read More: ఓయమ్మో దీపిక ధరించిన ఈ బ్రేస్ లేట్ ఖరీదు అన్ని కోట్లా… అమ్మితే లైఫ్ సెటిల్?

ట్రెండింగ్ వార్తలు