May 28, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి చిరంజీవి ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి పదవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇలా సినిమాల పరంగా ఎంతో సక్సెస్ అందుకుని సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు కాను ఇప్పటికే ఎన్నో రకాల అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకున్నారు. తాజాగా చిరంజీవికి దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది.
ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. తాజాగా చిరంజీవికి కూడా ఈ గోల్డెన్ వీసా ని అందజేశారు. ఇక గోల్డెన్ వీసా అందుకున్నటువంటి వారు 10 సంవత్సరాల పాటు దుబాయిలో నివాసం ఉండవచ్చు వీరికి ఈ విధమైనటువంటి పరిమితులు కూడా ఉండవు. ఇప్పటికే ఈ విధమైనటువంటి అవార్డును ఎంతో మంది సెలబ్రిటీలు అందుకున్నారు.
ఇక మెగా కుటుంబంలో ఈ గోల్డెన్ వీసా అందుకున్నటువంటి లిస్టులో చిరంజీవి మూడో వ్యక్తిని చెప్పాలి. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికీ ఈ గోల్డెన్ వీసా అందింది. చిరంజీవి కంటే ముందుగా తన కోడలు ఉపాసన ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు ఈమెతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే ఈ గోల్డెన్ వీసా అందుకున్న సంగతి తెలిసిందే.
Read More: ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు… వింత కోరికను బయటపెట్టిన త్రిష!