పవన్ చరణ్ నటించిన ఆ సినిమాలంటే చాలా ఇష్టం.. చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

May 11, 2024

పవన్ చరణ్ నటించిన ఆ సినిమాలంటే చాలా ఇష్టం.. చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు చిరంజీవి తాజాగా బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరిద్దరూ రాజకీయాల గురించి మాత్రమే కాకుండా సినిమాల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి చిరంజీవి సినిమాల గురించి ప్రశ్నించారు.

ఇకపోతే మీ మెగా ఫ్యామిలీలో మీరు మాత్రమే కాదు చాలామంది హీరోలు ఉన్నారు కదా మరి మీకు మీ సినిమాలు కాకుండా మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే మీ కుమారుడు రాంచరణ్ నటించిన సినిమాలలో ఏ సినిమాలంటే బాగా ఇష్టం అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఈ సినిమా తర్వాత బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలన్నా కూడా తనకు చాలా ఇష్టమని చిరంజీవి తెలియచేశారు. ఇక తన కుమారుడు చరణ్ నటించిన సినిమాల విషయానికి వస్తే తనకు మగధీర సినిమా అంటే చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. ఇలా మగధీర సినిమా అంటే ఇష్టమని చెప్పగానే వెంటనే కిషన్ రెడ్డి అవును ఆ సమయంలో మీరు అసెంబ్లీలో ఉన్నారు మా దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా నా కొడుకు నటించిన సినిమా మంచి సక్సెస్ అయిందని చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ నేను రాజకీయాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాననీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లారు అయితే రాజకీయాల్లో తనకు సూట్ అవ్వవని భావించినటువంటి చిరంజీవి తిరిగి సినిమాలలో కొనసాగుతూ బిజీగా ఉన్నారు.

Read More: బ్రహ్మానందం, కోవై సరళని ఏమని పిలుస్తారో మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు