April 26, 2022
Chiranjeevi Sensational Comments on Acharya Intrest: చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది. అయితే ఈ సినిమా మొదటి పది రోజులు టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.. అయితే విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇకపై పెద్ద హీరోల సినిమాలకు మొదటి వారం, పది రోజులు టికెట్ రేట్ల కింద పెద్ద మొత్తాల్లో చెల్లించుకోవాల్సిందేనా? అని విలేఖరి అడిగిన ప్రశ్నక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు మెగాస్టార్…
Book Chiranjeevi Acharya Tickets Here: https://bookmy.show/Acharyaబడ్జెట్ కు తగ్గట్టు టికెట్ రేట్లు పెంచడంలో తప్పు లేదని తేల్చి చెప్పారు చిరంజీవి. పైగా ఇండస్ట్రీ నుంచి నికార్సుగా కోట్లకు కోట్లు ట్యాక్స్ లు ఇరు ప్రభుత్వాలకు వెళ్తున్నప్పుడు ఆపత్కాలంలో ఇలా వెసులుబాటు అడగడంలో తప్పు లేదన్నారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
కరోనా వల్ల ప్రతి రంగం సంక్షోభాన్ని ఎదుర్కుంది. తెలుగు సినీ పరిశ్రమ కూడా చితికిపోయింది. ఓ సినిమాకు కేవలం వడ్డీనే 50 కోట్లు కట్టినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? మేం కట్టాం. ఆచార్య సినిమాకు అక్షరాలా 50 కోట్లు వడ్డీ కట్టాం. ఆ డబ్బు తిరిగా ఎలా రాబట్టుకోవాలి.. ప్రభుత్వాలు కనికరించి జీవో ఇస్తేనే ప్రేక్షకులు అర్ధం చేసుకుని సినిమాకు వస్తారు, ఇది అడుక్కుంటున్నట్టు కాదు. అవసరంలో ఉన్నాం. వినోదం ఇద్దామని భారీ బడ్జెట్ పెట్టాం. అనుకోని పరిస్థితుల్లో వడ్డీ పెరిగింది. మా వడ్డీతో ఓ మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమా తీయొచ్చు అని చెప్పారు.
ReadMore: HD Stills From Acharya