December 15, 2021
దర్శకుడు కొరటాల శివ, హీరో అల్లు అర్జున్‌ల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించాల్సిన సినిమా పత్తా లేకుండా పోయింది. అల్లు అర్జున్‌కు కొరటాల చెప్పిన కథ నచ్చలేదట. కథలో కొన్ని మార్పులు చెప్పడంతో కొరటాల హార్ట్ అయ్యారు. సినిమా క్యాన్సిల్ అయ్యింది. రీసెంట్‌గా మీడియా…కొరటాల శివ సినిమాను గురించి ప్రస్తావించి నప్పుడు..ఇప్పుడా విషయాలు ఎందుకు? అని అన్నారట అల్లు అర్జున్.
Read More: http://సమంత..ఊ అనడమే కరెక్ట్!కొరటాల, అల్లు అర్జున్‌ల మధ్య వైరం ఇంకా కొనసాగుతుందనడానికి మొన్న ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఓ నిదర్శనం. ఈ ఫంక్షన్‌లో నేను ఏం మాట్లాడినా అవి సుకుమార్ మాటలుగానే పరిగణించాలి, అవి నా మాటలు కాదని చెప్పాడు. ఈ ఫంక్షన్‌లో సొంతంగా కొరటాల మాట్లాడిన మాట ‘‘పుష్ప’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’. మరి…అల్లు అర్జున్‌పై కోపం ఉన్నప్పుడు ‘పుష్ప’ ప్రీ రిలీజ్‌కు అల్లు అర్జున్ ఎందుకు వచ్చారంటే…కొరటాల హిట్ మూవీస్ ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ చిత్రాలను నిర్మించింది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాను నిర్మించిన మైత్రీమూవీమేకర్సే. పైగా సుకుమార్ సినిమా ప్రతీ ఫంక్షన్‌కు కొరటాల ప్రజెన్స్ తప్పుకుండా ఉంటుంది. ఈ కారణాలే ‘పుష్ప’ ప్రి రీలీజ్ పంక్షన్‌కు కొరటాలను రప్పించేలా చేశాయి. అయితే..అల్లు అర్జున్‌కు కొరటాల చెప్పింది యాంగర్ మేనేజ్‌మెంట్ కథ అని,ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆల్రెడీ నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా చేశారు కాబట్టి అందుకే కొరటాల కథను బన్నీ వద్దనుకున్నారని బన్నీ వర్గాలు చెబుతున్నాయి.