May 15, 2024
వరుస సినిమాలు చేస్తూ విజయాల మీద విజయాలు అందుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. దసరా లాంటి ఊర మాస్ మూవీ తర్వాత, హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ మూవీచేశాడు. తర్వాత ఇప్పుడు సరిపోద్దా శనివారం లాంటి పక్కా కమర్షియల్ మూవీతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ గా వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాలో వారంలో ఒకరోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరమీద కనిపిస్తాడు నాని. అయితే ఆ ఒక్క రోజే కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తాడో తెలియాలంటే సరిపోతే శనివారం సినిమా చూడాల్సిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో దరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయకగా చేస్తుంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ ఫైటింగ్ హైదరాబాదులో తెరకెక్కిస్తున్నారు.
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భారీ సెట్లో నాని ఇతర తారాగణంపై ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. నాని ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఒక శక్తివంతమైన పాత్ర ఈ సినిమాలో చేస్తున్నారు. ఈయన క్యారెక్టర్ పేరు సూర్య. తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకి తీసుకు వస్తామని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మూవీ మేకర్స్.
ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్. కూర్పు కార్తీక్ శ్రీనివాస్, ఫైటింగ్స్ రామ్ లక్ష్మణ్, ఛాయాగ్రహణం మురళి. జి. నాని ఈ సినిమా కోసం తన కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ విలన్ గా దూసుకుపోతున్న ఎస్ జె సూర్య ని ఏరి కోరి ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. డిఫరెంట్ టైటిల్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.
Read More: ఆలయ నిర్మాణం కోసం లక్షల్లో విరాళం ఇచ్చిన ఎన్టీఆర్.. ఎక్కడో తెలుసా?