Cobra Teaser: విక్ర‌మ్ న‌ట‌విశ్వ‌రూపం చూశారా?

August 24, 2022

Cobra Teaser: విక్ర‌మ్ న‌ట‌విశ్వ‌రూపం చూశారా?

విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కోబ్రా’. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఓ క్రిమినల్‌ మేథమ్యాటిషియన్‌ గా కనిపించ‌నున్నారు విక్రమ్‌. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

“ప్రతి సమస్యకు ఒక మ్యాథమ్యాటికల్ సొల్యూషన్ ఉంటుందని విక్రమ్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. కోబ్రా ఈజ్ ఏ జీనియస్ మ్యాథమ్యాటీషియన్.. అతను మ్యాథ్స్ ఉపయోగించి అసాధ్యమైన క్రైమ్స్ చేస్తుంటాడు అంటూ ఒక అమ్మాయి వాయిస్ తో సినిమా కథను చూపించేశారు. లెక్కల మాస్టర్ మది.. తన మేథస్సును ఉపయోగించి క్రైమ్స్ చేస్తూ ఉంటాడు.

అతడిని పట్టుకోవడానికి పోలీసులు. ఇంటర్ పోల్ తిరుగుతూ ఉంటుంది. వారి నుంచి తప్పించుకొని కోబ్రా ఎలాంటి క్రైమ్స్ చేశాడు. అసలు లెక్కల మాస్టర్ మది.. కోబ్రా గా ఎందుకు మారాడు..? అనేది కథగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు అనేది ముందు నుంచి విన్న మాటే. తాజాగా టీజర్ లో విక్రమ్ కష్టం కనిపిస్తోంది. ఇందులో దాదాపు 10 అవతారాలలో కనిపించనున్నాడు.

ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఓ కీ రోల్‌ చేశారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు.

ట్రెండింగ్ వార్తలు