మనోజ్.. విష్ణు మధ్య గొడవలు సర్దుమనగలేదా.. కోల్డ్ వార్ జరుగుతూనే ఉందా?

July 9, 2024

మనోజ్.. విష్ణు మధ్య గొడవలు సర్దుమనగలేదా.. కోల్డ్ వార్ జరుగుతూనే ఉందా?

Manchu Manoj Daughter Name Ceremony: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఎంతో మంచి గుర్తింపు ఉంది. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో విలక్షణ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఈయన హీరోగా కూడా అలాగే నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా విష్ణు మనోజ్ లక్ష్మీ మంచు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. అయితే కెరియర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగత విషయంలో మంచు మనోజ్ విష్ణు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయని ఇద్దరికీ మాటలు కూడా లేవని తెలుస్తోంది. మంచు మనోజ్ పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తన తమ్ముడి పెళ్లిలో కూడా ఒక అతిథి లాగా వచ్చి వెళ్లారు తప్ప బాధ్యతగా పెళ్లి చేయలేదంటూ విమర్శలు వచ్చాయి.

ఇక మనోజ్ పెళ్లి తర్వాత ఏకంగా వీరిద్దరూ బహిరంగంగా కొట్టుకున్నటువంటి కొన్ని వీడియోలు కూడా బయటకు రావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో మంచు విష్ణు ఇది ఒక సిరీస్ కోసమే చేశామంటూ చెప్పుకు వచ్చారు. కానీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఇప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని తెలుస్తోంది.

ఇటీవల మంచు మనోజ్ తన కుమార్తెకు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించడమే కాకుండా తన కుమార్తెకు దేవసేన శోభ ఎం ఎం అనే పేరును పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు కానీ ఎక్కడ విష్ణు పేరు ప్రస్తావనకు రాలేదు. ఇలా విష్ణు పేరు చెప్పకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

Related News

ట్రెండింగ్ వార్తలు