అక్కడ ఎన్నికలు పెడితే ఆయనే సీఎం.. నేనే మినిస్టర్: అలీ

June 29, 2024

అక్కడ ఎన్నికలు పెడితే ఆయనే సీఎం.. నేనే మినిస్టర్: అలీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అలీ. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించిన సంగతి తెలిసిందే ఇకపోతే అలీకి ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని చెప్పాలి. ఇక పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నారు అంటే ఆలీ కోసమే ఒక పాత్రను క్రియేట్ చేస్తారు.

ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి పూరీతో పాటు అలీ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. పూరి జగన్నాథ్ బాధలో ఉంటే ఒక పెగ్ ఇచ్చి తనని ఓదారుస్తాను అలాగే సంతోషంలో ఉంటే తనకు ఒక బొకే ఇస్తానని తెలిపారు. ఇక పూరి జగన్నాథ్ ఎక్కువగా సినిమా స్క్రిప్ట్లను రాయాలి అంటే ఆయన బ్యాంకాక్ లోనే ఉంటారు.

బ్యాంకాక్ బీచ్ పక్కన స్క్రిప్టు రాస్తూ ఉంటారు. ఇలా తరచూ బ్యాంకాక్ వెళ్ళటం వల్ల ఆయనకు అక్కడ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బ్యాంకాక్ లో ఎన్నికలు జరిగిన తప్పకుండా పూరి జగన్నాథ్ అక్కడ సీఎం అవుతారని అంతలా ఆయనకు క్రేజ్ ఉందని తెలిపారు. ఇక తాను సీఎం అయితే నేను తప్పకుండా హోమ్ మినిస్టర్ అవుతాను అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ కు అక్కడ ఉన్నటువంటి క్రేజ్ గురించి చెబుతూ అలీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కానుంది

Read Moreఅయాన్ క్రేజ్ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు