Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ..చూడకపోతే వెంటనే చూసేయండి?

July 11, 2024

Vindhu Bhojanam: ఆహాలో దూసుకుపోతున్న క్రేజీ మూవీ..చూడకపోతే వెంటనే చూసేయండి?

మన తెలుగు ఓటీటీ ఆహాలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల సింగింగ్, డాన్సింగ్, రియాలిటీ షోస్.. మ‌రెన్నో రకాల వినోదాత్మక కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఆహాలో విడుదలైనటు వంటి విందు భోజనం సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. ఆహాలో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుంది. ఇందులో చాలా వరకు కొత్త నటీనటులు నటించినప్పటికీ మంచి ఆదరణ పొందింది.

అఖిల్ రాజ్, ఐశ్వర్య జంటగా సిద్దార్థ్ గొల్లపూడి, హర్షవర్ధన్, అనిత చౌదరి, కేశవ్ దీపక్, ఆశ్రిత వేముగంటి.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..చిన్నప్పట్నుంచి చెఫ్ అవుదామనుకొని పెద్దయ్యాక ఓ రెస్టారెంట్ లో చెఫ్ అవుతాడు హీరో, అతని చెఫ్ కల, అతని లవ్ స్టోరీ, రెస్టారెంట్ గొడవలు, తండ్రి ఎమోషన్.. ఇలా అన్నింటిని క‌లిపి ఆసక్తికరంగా విందు భోజనం సినిమాని తెరకెక్కించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి వినోదాత్మకమైన ఈ చిత్రాన్ని ఇప్పటివరకు చూడకపోతే వెంటనే ఆహాలో చూసి ఎంజాయ్ చేసేయండి.

Related News

ట్రెండింగ్ వార్తలు