బన్ని స్టెప్పులకు ఫిదా అయినా డేవిడ్ వార్నర్.. ఇది సులభం అంటూ రియాక్ట్ అయిన అర్జున్!

May 3, 2024

బన్ని స్టెప్పులకు ఫిదా అయినా డేవిడ్ వార్నర్.. ఇది సులభం అంటూ రియాక్ట్ అయిన అర్జున్!

పుష్ప మేనియా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుష్ప .. పుష్ప అంటూ కొనసాగే ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇక ఈ పాటపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు అభిమానులు ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీకి వీరాభిమాని అయినటువంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎప్పుడు బన్నీని అనుసరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పుష్ప టైటిల్ సాంగ్ పై కూడా ఈయన స్పందించారు. ఈ పాటలోని కొంత ట్రాక్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ. పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అలాగే #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను తన పోస్టుకు జత చేశాడు. ఇక బన్నీ పోస్టుకు ఫ్యాన్స్, సెలబ్రెటీస్ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ కూడా స్పందించారు.ఓ డియర్ ఇది చాలా బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది అంటూ బన్నీని ట్యాగ్ చేశాడు. ఇది చూసిన అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. ఇది చాలా సులభం.. మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేయడంతో మీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ వైరల్ అవుతుంది.

Read More: ఆ హీరో పై మనసు పారేసుకున్న సుప్రీత.. ఏకంగా పెళ్లి చేసుకోవాలనుకుంటుందా?

Related News

ట్రెండింగ్ వార్తలు