ప్రభాస్ వల్లే నేను ఇలా అయ్యాను… దీపికా షాకింగ్ కామెంట్స్ వైరల్!

June 20, 2024

ప్రభాస్ వల్లే నేను ఇలా అయ్యాను… దీపికా షాకింగ్ కామెంట్స్ వైరల్!

deepika padukone comments on prabhas home food :దీపికా పదుకొనే పరిచయం అవసరం లేదు బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక పదుకొనే పెళ్లి తర్వాత చాలా సంవత్సరాలకు తల్లి కాబోతున్నారు. ఈ శుభవార్తను ఈమె అభిమానులతో పంచుకున్నారు.

ఇక ప్రెగ్నెన్సీ ని ప్రకటించినప్పటి నుంచి ఈమె పెద్దగా బయట ఎక్కడ కనిపించడం లేదు ఇంటి పట్టునే ఉంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా దీపికా నటించినా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో ఈమె పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో దీపిక పాల్గొనడంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో దీపిక బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి స్నేహ ప్రభాస్ ఎక్కడుంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా ఎంతో రుచికరమైన భోజనాన్ని తెప్పించి వారికి పెడుతూ ఉంటారు ఈ క్రమంలోనే దీపికా సైతం మాట్లాడుతూ కల్కి సినిమా షూటింగ్లో భాగంగా ప్రభాస్ ఎన్నో రకాల భోజనాలను తీసుకువచ్చే వారని తెలిపారు. ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తినడం వల్లే నా కడుపు ఇలా అయింది అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను ప్రభాస్ తీసుకొచ్చిన భోజనం ఎంతో ఇష్టంగా తినే దాన్ని తద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బేబీ బంప్ కూడా వచ్చింది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Read More: క్లిన్ కార ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన!

ట్రెండింగ్ వార్తలు