September 25, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `దేవర`. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ తొలిభాగం దేవర పార్ట్:1
ని సెప్టెంబరు 27న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఆర్ ఆర్ ఆర్
తర్వాత వస్తోన్న సినిమా కావడంతో దేవరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే అరవింద సమేత వీర రాఘవ
తర్వాత ఎన్టీఆర్ సోలోగా సినిమా వచ్చి దాదాపు ఆరేళ్లు కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దేవర
తిరుగులేని రికార్డులు సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధర పెంపు, అదనపు షోలకు అనుమతి రావడంతో తొలిరోజు ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా తొలిరోజు 100కోట్ల మార్కును ధాటే అవకాశం ఉంది. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామీని సృష్టించనుంది దేవర
.
ఆచార్య
తర్వాత కొరటాల శివ కసితో ఈ సినిమా తెరకెక్కించాడని తెలుస్తోంది..దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించారు.