స‌మంత త‌న డ్యాన్స్, లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది – దేవి శ్రీ ప్ర‌సాద్‌

January 18, 2022

స‌మంత త‌న డ్యాన్స్, లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది – దేవి శ్రీ ప్ర‌సాద్‌

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’లోని ఐటమ్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సోష‌ల్ మీడియాని ఎంత‌లా ఒక ఊపు ఊపేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. కెరీర్‌లోనే తొలిసారి ఈ పాటతో ప్రత్యేక గీతంలో న‌టించింది స్టార్ హీరోయిన్ సమంత. చైతూతో విడాకుల త‌ర్వాత స‌మంత ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌డం కూడా ఆడియ‌న్స్‌లో ఈ పాట‌పై ఆస‌క్తిరేకెత్తించింది. ఈ పాట‌పై త‌న‌దైన శైలిలో స్పందించాడు సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌.

‘‘వాస్తవానికి ఈ పాటంతా సిద్ధమైనా.. ఇందులో ఎవరు డ్యాన్స్ చేయాల‌నేది అప్పటికింకా ఫైనల్‌ కాలేదు. సమంతను ఎంపిక చేయాలన్నది పూర్తిగా దర్శకుడు సుకుమార్‌, నిర్మాతల నిర్ణయం. ఇక సామ్‌ని ఫైనల్‌ చేసిన రెండు రోజుల ముందే నాకా విషయం తెలిసింది. ఈ పాటకు సామ్‌ని ఓకే చేయడం చక్కటి ఎంపిక‌. పాటకి ఫ్రెష్‌ ఫీల్‌ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ఆమెను వివిధ పాత్రల్లో చూశాం. తొలిసారి ఐటమ్‌ సాంగ్‌లో కనిపించడం, అలాగే ఆమె మేకోవర్‌ కూడా చాలా బాగుంది. నా మ్యూజిక్‌లో నర్తించడం సంతోషంగా ఉంది. తన డ్యాన్స్, లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట కోసం తను చేసిన కృషిని అభినందిస్తున్నా’’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు