గొప్ప మనసును చాటుకున్న హీరో ధనుష్.. అందుకోసం కోటి రూపాయలు విరాళం?

May 15, 2024

గొప్ప మనసును చాటుకున్న హీరో ధనుష్.. అందుకోసం కోటి రూపాయలు విరాళం?

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం తో పాటు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు ధనుష్. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగు లోకి విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ధనుష్ నటించిన సినిమాలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి.

కాగా మొన్నటి వరకు హీరో ధనుష్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిన విషయం తెలిసిందే. అందుకు గల కారణం ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడాకులు తీసుకోవడమే. ఆ సంగతి పక్కన పెడితే.. హీరో ధనుష్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. కోటి రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు ధనుష్. న‌డిగ‌ర్ సంఘం నూత‌న భ‌వ‌న నిర్మాణ కోసం ఈ మొత్తాన్ని ఇచ్చారు. కోటి రూపాయ‌ల చెక్‌ను న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు, న‌టుడు నాజ‌ర్‌, కోశాధికారి కార్తీలకు అందించారు. ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ తెలిపింది.

ధ‌నుష్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ధనుష్ అభిమానులు ధనుష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొత్త భ‌వాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం న‌డిగ‌ర్ సంఘం విరాళాలు సేక‌రిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు విరాళాలు అంద‌జేశారు. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్‌లు గ‌తంలో రూ.కోటి విరాళంగా ఇచ్చారు. హీరో శివ కార్తీకేయ‌న్ సైతం రూ.50ల‌క్ష‌లు అందించారు.

Read More: కంగనా రనౌత్ ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. ఏకంగా అన్ని కోట్లా?

ట్రెండింగ్ వార్తలు