‘లవ్ మీ’ ఆడియెన్స్‌కి నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు

May 17, 2024

‘లవ్ మీ’ ఆడియెన్స్‌కి నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు.

అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘ఈ మూవీతో ఓ దర్శకుడి పుట్టుకను చూడబోతోన్నారు. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. శివ పార్వతులు, సతీ దేవీ, గంగా దేవీల్లాంటి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆర్జున్ అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. అర్జున్ కారెక్టర్‌లో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స కావాలి. మనిషి ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం,గట్స్ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశించే ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడుస్తోంది. వై? అనే క్వశ్చన్స్ లేకుండా వావ్ అని సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘లవ్ మీ ఇఫ్ యు డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

ఆశిష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చిన అరుణ్, నాగలకు థాంక్స్. మా చిత్రానికి మేజర్ అస్సెట్‌ అయిన పీసీ శ్రీరామ్, కీరవాణి గార్లకు థాంక్స్. టీజర్, ట్రైలర్ బాగుంటే సినిమాను చూస్తారు. కథ బాగుంటే ఆడియెన్స్ మూవీస్ చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకు కళ వస్తుంది. సింగిల్స్ స్క్రీన్స్ నిండిపోతాయి. చీకటి రూం అంటేనే నాకు భయం. అలాంటి నన్ను స్మశానంలోకి తీసుకెళ్లారు. వైష్ణవి, రవి అందరితో షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు హర్షిత్ అన్న, హన్షిత అక్క, దిల్ రాజు గార్లకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. ‘స్కల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఈ మూవీకి తక్కువ రోజులే పని చేసినా వైష్ణవి, ఆశిష్‌లు ఫ్యామిలీ మెంబర్స్‌‌‌లా మారిపోయారు. మే 25న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

రవికృష్ణ మాట్లాడుతూ.. ‘విరూపాక్ష చేసిన టైంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ మూవీకి చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. వైష్ణవి, ఆశిష్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మే 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Read More: మరుగునపడిన ప్రాజెక్టు మళ్లీ తెర మీదకి.. ఈసారి తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి!

ట్రెండింగ్ వార్తలు