ఎఫ్ 3 విష‌యంలో దిల్‌రాజు రిస్క్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఇదేనా?

February 2, 2022

ఎఫ్ 3 విష‌యంలో దిల్‌రాజు రిస్క్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఇదేనా?

Dil Raju to Take The Risk Again: ప్ర‌తి విష‌యాన్ని క‌మ‌ర్షియ‌ల్ గా లెక్కలు వేసుకుని చూసే వ్య‌క్తి దిల్‌రాజు. రిస్క్ అనే మాట ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు. హిట్ కాంబినేష‌న్‌లు, సేఫైన ఫ్యామిలీ క‌థ‌ల‌తోనే సినిమాలు తీసి ఎక్కువ విజ‌యాలు సాధించారు. భిన్నంగా ట్రై చేసిన సినిమాలు భాక్సాఫీసు వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఇప్ప‌టికే శంక‌ర్ లాంటి భారీ డైరెక్ట‌ర్ తో సినిమా క‌మిటై పెద్ద రిస్క్ చేశారు దిల్‌రాజు. అదే కాకుండా దిల్‌రాజు మ‌రో భారీ రిస్క్ చేస్తున్నాడు.

దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎఫ్‌3 ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ఎఫ్ 2 సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో ఎఫ్ 3పై అంచ‌నాలు పెరిగాయి. పైగా వేస‌వి సీజ‌న్‌లో విడుద‌ల అవుతున్న సినిమా కాబ‌ట్టి, భారీ వ‌సూళ్లు ద‌క్క‌డం ఖాయం. అయితే… మ‌రుస‌టి రోజే. ఏప్రిల్ 29న `ఆచార్య‌` రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. అది త‌ప్ప‌కుండా ఎఫ్ 3పై ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఎప్పుడూ సోలో రిలీజ్‌ల‌కే మొగ్గుచూపే దిల్‌రాజు, ఎఫ్ 3 విషయంలో మాత్రం చిరుకి పోటీగా వెళ్ల‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది. నైజాంలో దిల్ రాజుకి తిరుగులేదు. ఆయ‌న చెప్పిన రేటుకు నిర్మాత‌లు సినిమాలు ఇవ్వాల్సిందే.. ఎక్కువ థియేట‌ర్స్ ఆయ‌న చేతిలోనే ఉండ‌డం నిర్మాత‌గా కూడా అంద‌రికీ కావాల్సిన వారు కావ‌డంతో దిల్‌రాజు అడిగిన రేటుకే సినిమాలు ఇచ్చేవారు నిర్మాత‌లు.

అయితే ఈ మ‌ధ్య నైజాంలో వ‌రంగ‌ల్ శ్రీ‌ను నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది దిల్‌రాజుకి. ఆచార్య నైజాం రైట్స్ దిల్‌రాజు క‌న్నా ఎక్కువ రేటు ఆఫ‌ర్ చేసి వ‌రంగ‌ల్ శ్రీ‌ను ద‌క్కించుకున్నాడు. నిర్మాత‌లు కూడా దిల్‌రాజుని కాద‌ని వ‌రంగ‌ల్ శ్రీ‌నుకే ఆచార్య నైజాం రైట్స్ ఇచ్చారు. త‌న‌ని కాద‌ని… శ్రీ‌నుకి ఆచార్య రైట్స్ ఇవ్వ‌డం దిల్ రాజుకి న‌చ్చ‌లేద‌ని, అందుకే ఆచార్య‌పై పోటీగా త‌న సినిమాని విడుద‌ల చేస్తున్నార‌ని తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజు చేతిలో ఎక్కువ థియేట‌ర్లున్నాయి. ఆచార్య రిలీజైన రోజు మిన‌హా నైజాంలో దాదాపు అన్ని థియేట‌ర్స్‌లోనూ ఎఫ్ 3 సినిమానే ఆడ‌నుంది. దీంతో మెగాస్టార్ ఆచార్య‌కు నైజాంలో గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుంది. త‌నకి పోటీగా వ‌స్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నును అలాగే త‌న‌ని కాద‌ని నైజాం రైట్స్ వేరే వాళ్ల‌కి ఇచ్చిన నిర్మాత‌ల‌కి షాక్ ఇచ్చేందుకే దిల్ రాజు ఈ రిస్క్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది.

READ MORE: ఎన్టీఆర్ – బుచ్చిబాబు సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌!

ట్రెండింగ్ వార్తలు