ఫ్యామిలీ స్టార్ మూవీ కి దిల్ రాజు భార్య రివ్యూ.. గెస్ట్ రోల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

April 4, 2024

ఫ్యామిలీ స్టార్ మూవీ కి దిల్ రాజు భార్య రివ్యూ.. గెస్ట్ రోల్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అవుతుంది. గతంలో విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గీతాగోవిందం భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా గెస్ట్ రోల్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంగా దిల్ రాజు చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఆమె నటిస్తుందా లేదా అనే విషయం క్లియర్ గా చెప్పకుండా నటిస్తుందో లేదో తెలియాలంటే థియేటర్లలోనే చూడాలని క్యూరియాసిటీని కలిగించారు.

అయితే ఈరోజు అమెరికాలో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. హైదరాబాదులో మీడియా, మూవీ మేకర్స్ ఫ్యామిలీ లకు సైతం సినిమా చూపించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే అంతకుముందు వేసిన ఒక షోలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, దిల్ రాజు ఫ్యామిలీలు సినిమాను చూసాయి. దిల్ రాజు అయితే తన భార్య ఫ్యామిలీ సినిమా చూశాక హిట్ కొట్టేసారండి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆనందంగా చెప్పారు.

అలాగే దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి కూడా విజయ్ దేవరకొండ కిల్డ్ ఇట్ అంటూ తనని హగ్ చేసుకుందని చెప్పారు దిల్ రాజు. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయిందని దర్శకుడు కి ఫోన్ చేసి చెప్పిందని చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ ఈ సినిమా చూసి దిల్ రాజు బయోపిక్ లా ఉందని చెప్పారంట. ఈ విషయం స్వయంగా దిల్ రాజే చెప్పడం విశేషం. ఈ రివ్యూస్ అన్ని చూస్తుంటే సినిమా సాలిడ్ హిట్ కొట్టేలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్స్.

Read More: నాకు ఐదో పెళ్లి చేయాలని చూస్తున్నారు.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అంజలి!

ట్రెండింగ్ వార్తలు