December 7, 2021
స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్ అని అందరికీ తెలుసు. అందరు హీరోలు, దర్శకులు,నిర్మాతలు ఆయనతో చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాగే అన్ని రాజకీయపార్టీలతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. అందుకే ఆయన బర్త్‌డే పార్టికీ దాదాపు అగ్ర హీరోలందరూ హాజరయ్యారు. ఇప్పుడు విషయం ఏంటంటే దిల్‌రాజు ఎప్పటినుంచో అనుకుంటున్న పవన్ కళ్యాణ్‌తో వకీల్‌సాబ్ సినిమా తీశారు. అలాగే బాలకృష్ణతో కూడా ఒక సినిమా తీయాలనే కోరిక ఉందట దిల్‌రాజుకి. దానికి మార్గాన్ని అఖండ సినిమా సులువు చేసింది.
గతవారం విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తున్న అఖండ సినిమాను నైజాం మరియు వైజాగ్ ఏరియాలకు పంపిణీ చేశారు. సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నందున మొదటి వారంలోనే ఆయన పెట్టుబడి వెనక్కి వచ్చింది. ఇక నుండి లాభాలు కళ్ల చూడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అఖండ టీమ్‌కు ఓ లావీష్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్, హీరోయిన్ ప్రగ్యా, శ్రీకాంత్ ఇతర నటీనటులు పాల్గొన్నారు. వీరితో పాటు దిల్‌రాజుతో కలిసి పని చేసిన దర్శకులందరిని ఆహ్వానించారట.
Read More: సోషల్ మీడియాలో రికార్డుల మోత…ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న పుష్ప ట్రైలర్ఈ పార్టీతో దిల్‌రాజు – బాలకృష్ణ కాంబినేషన్ ఖాయం అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయ. గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, సంపత్ నంది చిత్రాల తర్వాత బాలకృష్ణ దిల్‌రాజు బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బాలకృష్ణ కోసం మంచి కథ రెడీ చేయమని వేణు శ్రీరామ్‌కి చెప్పాడట దిల్‌రాజు. కథ నచ్చితే ఈ కాంబినేషన్లోనే సినిమా ఉంటుంది.