రాజమౌళి, మహేష్ మూవీకి ఐడియా ఇచ్చింది అతనేనా.. ఏకంగా జక్కన్నకే సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

June 6, 2024

రాజమౌళి, మహేష్ మూవీకి ఐడియా ఇచ్చింది అతనేనా.. ఏకంగా జక్కన్నకే సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వేరే దేశాల్లో షూటింగ్ అని, అడ్వెంచర్ కథతో ఈ సినిమా ఉంటుంది అని, మ్యూజిక్ మొదలుపెట్టేశారని పలువురు ఈ సినిమా టీమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

ఇది తాజాగా మహేష్, రాజమౌళి సినిమా గురించి డైరెక్టర్ అవనీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టాలీవుడ్ హీరో నవదీప్ హీరోగా లవ్ మౌళి అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో అవనీంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అవనీంద్ర చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. విజయేంద్రప్రసాద్, రాజమౌళి టీమ్ లో అసోసియేట్ రైటర్ గా కూడా పనిచేసాడు. బాహుబలి కంటే ముందు నుంచి కూడా వీళ్ళతో కలిసి పనిచేసాడు అవనీంద్ర. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అవనీంద్ర రచయితగా పనిచేసాడు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో ఇలా తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పిన అవనీంద్ర మహేష్,రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలోనే రాజమౌళి గారు నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నారని మాకు తెలుసు.

ఒక రోజు టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటే మహేష్ తో ఎలాంటి సినిమా చేయాలని రాజమౌళి అడిగారు. అందరూ తలో ఒకటి చెప్పారు. చివరగా కౌబాయ్ లేదా జేమ్స్ బాండ్ తరహా సినిమా అయితే బెస్ట్ అనుకొని అక్కడ ఉన్న వాళ్లలో ఎంతమంది కౌబాయ్, ఎంతమంది జేమ్స్ బాండ్ సినిమా అయితే బెటర్ అని అడిగారు. నేను ఏ సమాధానం చెప్పకపోయేసరికి రాజమౌళి గారు నన్ను అడిగారు. అప్పుడు నేను ఆల్రెడీ కౌబాయ్ గెటప్ లో మహేష్ బాబుని చూసేసారు. జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాలు చూసి చూసి ఉన్నారు జనాలు, కొత్తగా ఉండకపోవచ్చు అని చెప్పాను. మరి ఎలాంటి కథ అయితే బెటర్ అని అడిగితే అడ్వెంచరస్ టైప్ కథ అయితే బెటర్, మన దగ్గర ఫుల్ లెంగ్త్ అడ్వెంచరస్ భారీ సినిమాలు రాలేదు, కొత్తగా ఉంటుంది అని చెప్పాను. దానికి రాజమౌళి గారికి కూడా నచ్చి ఓకే చేసారని చెప్పుకొచ్చారు.

Read More: కొన్ని ఏళ్లుగా మూతపడిన ఆలయాన్ని తెరపించిన హీరో నిఖిల్.. గ్రేట్ అంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు