August 28, 2022
సీనియర్ దర్శకుడు భారతిరాజా(81) అనారోగ్య కారణాలతో కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు శనివారం సాయంత్రం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
‘‘భారతిరాజా మా ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఐసీయూలో చికిత్సలు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద’’ని పేర్కొన్నాయి. అయితే భారతీరాజా అనారోగ్యానికి కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు వైద్యులు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని వెల్లడించలేదు.