పాలిటిక్స్ లో పవన్ బిజీ బిజీ…ఉస్తాద్ భగత్ లేనట్టేనా… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

July 8, 2024

పాలిటిక్స్ లో పవన్ బిజీ బిజీ…ఉస్తాద్ భగత్ లేనట్టేనా… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Pawan Kalyan New Movies Update: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయరని ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమేనని అభిమానులు భావించారు. ఈ క్రమంలోనే ఇటీవల పిఠాపురం వెళ్లిన పవన్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. ఇదే విషయాన్ని నేను నిర్మాతలు కూడా చెప్పానని తెలిపారు. షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుందని తనకు వీలు దొరికినప్పుడు తప్పకుండా సినిమాలు పూర్తి చేస్తానని తెలిపారు. ఇప్పటికీ ఈయన కొన్ని సినిమాలను ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలేశారు అయితే త్వరలోనే ఆ సినిమాలన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందని ఇక ఈ సినిమా రాదు అంటూ వార్తలు వచ్చాయి ఇదే విషయం గురించి ఒక నేటిజన్ డైరెక్టర్ హరీష్ శంకరును ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందా అంటూ పోస్ట్ పెట్టగా డైరెక్టర్ హరిశ్ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే సమయం లేదు అంటూ రాసుకు వచ్చాడు. ఇలా ఈయన రూమర్స్ చదివే సమయం లేదని చెప్పడంతో ఇది కూడా రూమరేనని ఈ సినిమా ఆగిపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయింది ఇందులో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు