త్రివిక్రమ్ లేకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య?

May 30, 2024

త్రివిక్రమ్ లేకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కూడా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి మరొక రోజు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరకు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు కొన్ని ఆలస్యం అయ్యాయి. శర్వానంద్ తో ఒక సినిమా మొదలు పెట్టాను. అది కూడా హోల్డ్ లో పడింది. గ్యాప్ ఎక్కువ అయిపోతోంది అనే భయంతో మా గురువు గారు త్రివిక్రమ్ కి చెప్తే విశ్వక్ కి కథ చెప్పమన్నారు. విశ్వక్ కు కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. త్రివిక్రమ్ గారు నాకు మొదటి నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏ విషయమైనా ఆయనతోనే పంచుకుంటాను.

షూటింగ్ చేసొచ్చినప్పుడు సీన్స్ ఆయనకు చూపించేవాడిని. నాకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా ఆయన్నే అడుగుతాను. త్రివిక్రమ్ గారు లేకపోతే అసలు ఈ సినిమానే లేదు అని తెలిపారు కృష్ణ చైతన్య. అనంతరం విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ.. విశ్వక్ తెలంగాణ అబ్బాయి. సినిమాలో గోదావరి యాసని మాట్లాడగలడా అని ఆ విషయంలో భయపడ్డాను. కానీ 15 రోజులు ఒక ట్యూటర్ పెట్టుకొని, నేర్చుకొని చాలా బాగా మాట్లాడాడు. విశ్వక్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. విశ్వక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చెన్నైలో చేయించాను. అక్కడ సినిమా చూసిన వాళ్ళు కూడా విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడారు. ఈ సినిమా తర్వాత విశ్వక్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు అని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: పవన్ కళ్యాణ్ కు పోటీగా దుల్కర్ సల్మాన్.. ఓజీ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా?

ట్రెండింగ్ వార్తలు