గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది.. కృష్ణవంశీ స్ట్రాంగ్ కౌంటర్?

July 24, 2024

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవుతుంది.. కృష్ణవంశీ స్ట్రాంగ్ కౌంటర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ. ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈయన సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేష్ బాబు సోనాలి బింద్రే నటించిన మురారి సినిమా ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డైరెక్టర్ కృష్ణ వంశీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ రామ్ చరణ్ గురించి ఆయన సినిమాల గురించి ప్రశ్నలు వేశారు.

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ `గోవిందుడు అందరివాడే` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోని రామ్ చరణ్ కోసం ఒక అద్భుతమైన స్క్రిప్టు సిద్ధం చేసి పెట్టానని కృష్ణ వంశీ తెలిపారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రశ్నిస్తూ ఈ సినిమా కోసం మీరు ఎదురుచూస్తున్నారా అంటూ ఒక నెటిజన్ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు కృష్ణ వంశీ సమాధానం చెబుతూ రామ్ చరణ్ నాకు బిడ్డతో సమానం ఆయన సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.. అంతలోనే మరొక నెటిజన్ రాంచరణ్ నటించిన ఈ సినిమా పక్క ఫ్లాప్ అవుతుందని తెలిపారు. అలా సినిమా గురించి ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించకూడదు అంటూ కృష్ణవంశీ సమాధానం చెప్పారు. అంతలోనే మరొక నెటిజన్ డైరెక్టర్ శంకర్ అవుట్ డేటెడ్ అని తెలిపారు.

ఈయన చేసిన ఈ సినిమా పక్క ఫ్లాప్ అవుతుంది జరగండి.. సాంగ్ తోనే ఆ విషయం తెలిసిపోయిందని కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ కూడా కృష్ణవంశీ స్పందిస్తూ ఒక పాట చూసి సినిమాని ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదని తెలిపారు. శంకర్ గారు మంచి విజినరీ డైరెక్టర్ ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అంటూ కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Read MoreGame Changer: విడుదలపై క్లారిటీ ఇచ్చిన శంకర్.. మండిపడుతున్న చరణ్ ఫ్యాన్స్!

ట్రెండింగ్ వార్తలు