బుజ్జి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగీ.. అది చాలా స్పెషల్ అంటూ స్టేట్మెంట్!

May 23, 2024

బుజ్జి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగీ.. అది చాలా స్పెషల్ అంటూ స్టేట్మెంట్!

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ కల్కి. ఈ సినిమాని జూన్ 27 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే, దిశా పఠాని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని నాగ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మెగాస్టార్ అమితాబచ్చన్ లు కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

అంతటి కీలకమైన మరో పాత్ర బుజ్జి అనే ఒక రోబోట్ ది అంటున్నారు యూనిట్ సభ్యులు. అందుకోసమే ఆ రోబోట్ ని పరిచయం చేయడానికి ఏకంగా ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు. సినిమాలో నటించిన అమితాబచ్చన్ కి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ లేదు అలాంటిది బుజ్జికి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఈవెంటా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి బుజ్జి పేరు చిన్నదిగా ఉంటుంది కానీ మామూలుగా ఉండదు.

బుజ్జి మా అందరికీ చాలా స్పెషల్ అన్నారు దర్శకుడు నాగ అశ్విన్. అంతేకాదు ఈ వెహికల్ ని ప్రిపేర్ చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరిని అందరికీ పరిచయం చేశారు. వీళ్ళందరూ కలిసి చేసిన బుజ్జి చేసే మ్యాజిక్ ని త్వరలోనే చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ బుజ్జి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని సమాచారం. ఈ ఈవెంట్లో ఈ బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేయటానికి దాదాపు ఒక నిమిషం నిడివికల టీజర్ ని కూడా విడుదల చేశారు.

ఈ టీజర్ లోని విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. టెక్నికల్ అంశాలతో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. బుజ్జి గురించి ప్రభాస్ మాట్లాడుతూ బుజ్జి పేరు చిన్నది అయినా అది సినిమాకి చాలా ప్రత్యేకం నాగ్ అశ్విన్ బుజ్జి గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు అని చెప్పాడు. ఇక ఆ బుజ్జి చేసే చిత్రాలు ఏమిటో చూడాలంటే జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే.

Read More: తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు.. జూలై 1 వరకు గడువు!

ట్రెండింగ్ వార్తలు