పోకిరి సినిమా ఎలా హిట్ అయిందో అర్థం కాలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్?

July 3, 2024

పోకిరి సినిమా ఎలా హిట్ అయిందో అర్థం కాలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరోలు అందరూ కూడా పూరి డైరెక్షన్లో సినిమాలు చేసి హిట్ కొట్టిన వారే. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ క్రమంలోనే ఈయన హీరో రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడమే కాకుండా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా శతజయంతి వేడుకలను కూడా జరుపుకోవటం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ అవుతుందని డైరెక్టర్ ఊహించినప్పటికీ ఆయన ఊహకు అందని విధంగా ఈ సినిమా సక్సెస్ అయిందని పలు సందర్భాలలో పూరి వెల్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ క్రమంలోనే ఎంతోమంది పోకిరి లాంటి సక్సెస్ పడలేదని తన వద్ద అనడంతో ఒక్కసారిగా పూరి జగన్నాథ్ ఆశ్చర్యపోయారట. పోకిరి సినిమా అంతలా నచ్చడానికి కారణం ఏంటని మరోసారి ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈ సినిమా వేసుకొని మరి చూశారట. అయితే అప్పటికి కూడా తనకు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయం అర్థం కాలేదని పూరీ జగన్నాథ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఈ సినిమా క్లైమాక్స్ అనే ఈ క్లైమాక్స్ చూడటం కోసమే రిపీటెడ్ గా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాని సక్సెస్ చేశారని చెప్పాలి

Related News

ట్రెండింగ్ వార్తలు