ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్‌

January 2, 2022

ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్‌

RadhaKrishnaKumaraboutPrabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదు..దీంతో పాటు మంచి మనస్సు ఉన్న హీరోగా ప్రభాస్ ఇప్ప‌టికే ఎన్నో గుప్త‌దానాలు కూడా చేశారు. అయితే ప్ర‌భాస్ చేసిన స‌హాయం గురించి చెప్పుకోవ‌డానికి అస్సలు ఇష్ట‌ప‌డ‌రు. ప్ర‌స్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండగా మేకర్స్ మాత్రం ఈ సినిమాను వాయిదా వేయడం లేదని ఇప్పటికే స్పష్టతనిచ్చారు.

రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాతకాలు నిజం కాని పక్షంలో వేల సంవత్సరాల నుంచి అవి ఎందుకు కొనసాగుతున్నాయని… నిజం లేనివి ఎప్పుడో ఒకసారి అంతరించిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. మనకు తెలిసినంత మాత్రాన రైట్ అని తెలియనంత మాత్రాన రాంగ్ అని అనుకోకూడదని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు.

హీరో ప్రభాస్ ను దృష్టిలో ఉంచుకుని తాను రాధేశ్యామ్ సినిమా కథను రాశానని.. కథ పూర్తైన తర్వాత పూజా హెగ్డేను ఒక సందర్భంలో కలవగా ఆమె నాకు ప్రిన్సెస్ లా క‌నిపించింద‌ని ఆయ‌న‌ వెల్లడించారు. వీటితో పాటు ప్ర‌భాస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను చూసిన ప్రభాస్ చాలా సెన్సిటివ్ అని తన ముందు ఎవరైనా బాధ పడుతూ కనిపిస్తే ప్రభాస్ కు కూడా చాలా బాధ కలుగుతుందని దర్శకుడు వెల్లడించారు. తన పక్కన ఉండేవాళ్లంతా సంతోషంగా ఉండాలని భావించడం ప్రభాస్ పద్ధతి అని ఆయ‌న తెలిపారు. ఇక రాధేశ్యామ్ లో మేడ్‌ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా తెరపై ప్రభాస్ పూజా హెగ్డే కనిపిస్తారని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు.

Also Read: దుబాయ్‌లో మ‌హేష్‌ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌..ఫోటోలు వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు