June 28, 2024
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అందుకున్న చిత్రంగా కల్కి ఆదరణ పొందింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాణంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించగా, కమల్ హాసన్ అమితాబ్ వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం కల్కి సినిమాపై స్పందించారు.
కల్కి సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ కల్కి ప్రపంచం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. నాగీ అద్భుతమైన టేకింగ్ తో అదరగొట్టారని తెలిపారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని అమితాబ్, కమల్ హాసన్, దీపిక సపోర్ట్ అద్భుతం అని తెలిపారు. ఇక చివరి 30 నిమిషాలు ఈ సినిమా తననీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లిందని రాజమౌళి తెలిపారు. ఇలా అశ్విన్, వైజయంతి టీం అసాధారణ ప్రయత్నాన్ని ఈయన ప్రశంసించారు.
Read More: Kalki2898AD Twitte Review: ప్రభాస్ ఫ్యాన్స్ ఓకే..కానీ సాధారణ ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి?