వారితో జాగ్రత్తగా ఉండండి… వైఎస్‌జగన్‌కు ఆర్జీవీ సలహా

January 7, 2022

వారితో జాగ్రత్తగా ఉండండి… వైఎస్‌జగన్‌కు ఆర్జీవీ సలహా

RamGopalVarma: ఏపీ సినిమా టికెట్‌ ధరల విషయంలో ఇటీవల సోషల్‌మీడియా వేదికగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇండస్ట్రీ తరఫున ఫైట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నీ నానిగారు అపాయింట్‌ మెంట్‌ ఇస్తే ఆయన్ను కలిసి ఇండస్ట్రీ తరఫున సమస్యలు, సాధకబాధకాలను వివరిస్తారనని కూడా రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్స్‌ చేశారు.

Read More: PawanKalyan: భీమ్లానాయక్‌ వేకేషన్‌ కంప్లీట్‌

అయితే జనవరి 6న రాత్రి 11:30 గంటల సమయంలో ‘‘వైసీపీలో నమ్మే,ప్రేమించే ఒకే వ్యక్తి వైఎస్‌ జగన్‌గారు. కానీ ఆయన్ను కొంతమంది వైసీపీ లీడర్స్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు.వారి స్వార్థ ప్రయోజనాలు, లక్ష్యాల కోసం వైఎస్‌ జగన్‌కు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. జగన్‌గారు..మీ చుట్టు ఉన్న అలాంటి ప్రమాదకరమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి’’ అని ట్వీట్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. అలాగే జగన్‌గారు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ పట్ల మంచిగానే ఆలోచిస్తారు అనే అర్థం వచ్చేటువంటి మరో ట్వీట్‌ను కూడా ఆర్జీవీ తన ట్విటర్‌ టైమ్‌లైన్‌ నుంచి తొలగించారు. దీంతో ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ, అటు ఇండస్ట్రీలోనూ రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్స్‌ చర్చనీయాశంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు