August 11, 2022
బాలీవుడ్ బడా స్టార్ సల్మాన్‌ఖాన్‌తో సినిమా అంటే ఏ దర్శకుడు అయిన సరే సంబరపడిపోయి, మిగతా పనులన్నీ పక్కనపెట్టి కథపై కూర్చుంటాడు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం సల్మాన్‌కు నో చెప్పేశాడు. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మాస్టర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని పించుకుంది. వందకోట్ల క్లబ్‌లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు సల్మాన్‌ఖాన్. దక్షిణాదిన హిట్ సాధించిన ఎన్నో సినిమాలను హిందీలో రీమేక్ చేసిన సల్మాన్‌ఖాన్…మాస్టర్ సినిమాను కూడా హిందీలో తనతో తీయాలని లోకేష్‌కు ప్రపోజల్ పెట్టాడు. కానీ తాను విక్రమ్ సినిమా కోసం పని చేస్తున్నానని లోకేష్ బాలీవుడ్ కండల వీరుడికి నో చెప్పారు. అయితే కమల్‌హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందో తెలిసిందే కదా మరి. దీన్ని బట్టి లోకేష్ సరైన నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తుంది.
ఇక అలాగే మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను తమిళంలో రీమేక్ చేయాలనుకున్నారు లోకేష్. పృథ్వీరాజ్ పాత్రకు సూర్యను, బిజుమీనన్ పాత్రకు కార్తిని అనుకున్నారు. కానీ ఆ మలయాళ సినిమా తమిళ రీమేక్ హక్కులు వేరే నిర్మాత వద్ద ఉండటంతో కుదర్లేదు. ప్రస్తుతం విక్రమ్ ఇచ్చిన సక్సెస్‌తో లోకేష్ మళ్లీ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ నెక్ట్స్ కార్తితో ‘ఖైదీ 2’ చేస్తారు లోకేష్.