July 3, 2024
పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా రాంచరణ్ వ్యక్తిగత విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ రామ్ చరణ్ నుంచి ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో చరణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కూడా బయటకు రాకపోవడంతో చరణ్ ఫాన్స్ శంకర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
మరోవైపు చరణ్ కంటే సంవత్సరం వెనుక సినిమా షూటింగ్ పనులు ప్రారంభించిన ఎన్టీఆర్ సైతం తన దేవర సినిమాని సెప్టెంబర్ లోని విడుదల చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు చరణ్ సినిమా విడుదల విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్ భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జులై 12వ తేదీ విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి ఈయనకు రాంచరణ్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి .అయితే ఈ సినిమా గురించి శంకర్ మాట్లాడుతూ కేవలం 15 రోజుల్లో షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని భారతీయుడు 2 సినిమా పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు. ఇక ఇప్పటికి కూడా ఈయన విడుదల తేదీ గురించి సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో చరణ్ ఫాన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు